వేములవాడ శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలకు అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ ముఖ్య అతిథిగా హాజరైనారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఆరు సంవత్సరాల నుండి బతుకమ్మ చీరలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేద మహిళలకు బతుకమ్మ కానుకగా అందించడం జరుగుతున్నది.
చందుర్తి మండలానికి 13,451 చీరలు రాగా అన్ని గ్రామ పంచాయతీలలో ఈరోజు స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో పంపిణీ చేయడం జరుగుతుందని మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వం చేపడుతున్నదని 60 ఏళ్లలో జరగని పనులు 10 సంవత్సరాలలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది.
మళ్లీ రాబోయే కాలంలో మన ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నాగం కుమార్, సర్పంచ్ దుమ్మ ఆనంద్, ఎంపీడీవో రవీందర్, తాసిల్దార్ శ్రీనివాస్, ఎంపీ ఓ ప్రదీప్, ఏపిఎం రజిత, నాయకులు బైరగొని రమేష్ ఉపసర్పంచ్ రాజయ్య, పాక్స్ డైరెక్టర్ రమేష్, కార్యదర్శి సందీప్ మరియు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.