Home / ANDHRAPRADESH / చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్ర సంస్థలు…ఇక పర్మినెంట్‌గా చిప్పకూడు తప్పదా..!

చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్ర సంస్థలు…ఇక పర్మినెంట్‌గా చిప్పకూడు తప్పదా..!

ఏపీ స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే..చంద్రబాబు బెయిల్‌ , కస్టడీ పిటీషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టు, సీఐడీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి..అయితే చంద్రబాబును జగన్ సర్కార్ కక్షపూరితంగా అరెస్ట్ చేసిందని..అసలు స్కిల్ స్కామ్‌లో ఆధారాల్లేవని టీడీపీ శ్రేణులు, ఎల్లోమీడియా ఛానళ్లు గగ్గోలు పెడుతున్నాయి. చంద్రబాబును బయటకు తీసుకువచ్చేందుకు గంటకు కోటి ఇచ్చి మరీ సిద్ధార్ల్ లూథ్రా,  హరీష్ సాల్వే , సిద్ధార్థ్ అగర్వాల్ వంటి దేశంలోనే ఖరీదైన లాయర్లను తీసుకువచ్చారు..అయితే చంద్రబాబుపై నమోదైన స్కిల్ కేసులో బలమైన ఆధారాలు ఉండడంతో సీఐడీ న్యాయవాదుల వాదనల ముందు లూథ్రా బ్యాచ్ తెల్లముఖం వేస్తోంది. కాగా చంద్రబాబు అరెస్ట్ వెనుక రాజకీయ కక్ష లేదని…కేంద్ర దర్యాప్త్యు సంస్థలు, ఐటీ, ఈడీ వంటి సంస్థలు ఇచ్చిన పక్కా ఆధారాలతోనే సీఐడీ అరెస్ట్ చేసిందని సీఎం జగన్‌తో సహా, వైసీపీ మంత్రులు చెబుతున్నా పచ్చమీడియా ప్రచారం ముందు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ అంశాలు తెరమీదకు రావడం లేదు..అసలు చంద్రబాబు స్కిల్ స్కామ్ వెనుక అసలు వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చింది కేంద్ర సంస్థలే అని తెలుస్తోంది.

స్కిల్ స్కాంలో కేంద్ర దర్యాప్తు సంస్థలే సమాచారం ఇచ్చినట్లు కోర్టుకు సమర్పించిన చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో సీఐడీ స్పష్టం చేసింది. 2018లో మహారాష్ట్రలో జిఎస్‌టి, ఆదాయపన్నుశాఖ (ఐటి), ఆ తర్వాతి కాలంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నిర్వహించిన విచారణలో ఈ స్కిల్ స్కాం బయటపడిందని సీఐడీ వెల్లడించింది. ఆ నివేదకలే సిఐడి దర్యాప్తునకు ప్రాథమిక ఆధారాలుగా కనిపిస్తున్నాయి. స్కిల్‌ ప్రాజెక్టులో కీలకంగా ఉన్న డిజైన్‌టెక్‌ పూణె బేస్డ్‌ సంస్థ. ఎటువంటి వ్యాపార కార్యకలాపాలూ లేని సింగపూర్‌లో రిజిస్టరైన డొల్ల కంపెనీల పేరిట రూపొందించిన నకిలీ ఇన్వాయిస్‌లతో వస్తువులు, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌లను కొనుగోలు చేయడంపై 2017-18లోనే పూణెకు చెందిన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జిఎస్‌టి ఇంటెలిజెన్స్‌ దర్యాప్తు చేపట్టింది. ఆ వెంటనే పూణె ఇన్‌కంట్యాక్స్‌ యూనిట్‌ విచారణ చేసింది. ఏపి ప్రభుత్వం, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా డిజైన్‌టెక్‌కు విడుదలైన రూ.371 కోట్లలో కనీసం రూ.241 కోట్లు దుర్వినియోగం అయినట్లు ప్రాథమికంగా నిర్ధారించాయి. షెల్‌ కంపెనీలు బోగస్‌ ఇన్వాయిస్‌లు ఇచ్చాయని ఐటీ విచారణలో బయటపడింది. సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, కోర్స్‌వేర్‌, ఇతర వస్తువులు, సేవలు అందించకుండానే బ్యాంక్‌ ఖాతాలకు డబ్బు ట్రాన్స్‌ఫర్‌ అయింది. అక్కడి నుంచి హవాలా పద్ధతుల ద్వారా సొమ్ము బదిలీ చేశారని జిఎస్‌టి ఇంటెలిజెన్స్‌, ఇన్‌కంట్యాక్స్‌ డిపార్టుమెంట్లే తొలుత కనుగొన్నాయి. ఈ సమాచారంతోనే వైసిపి సర్కారు వచ్చాక అప్పటి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజేయ కల్లం స్కిల్‌ స్కాంపై అంతర్గతంగా విచారణ జరిపించి, ప్రాథమిక సాక్ష్యాధారం ప్రైమాఫెసీ ఉందని, సిఐడి దర్యాప్తునకు 2021 సెప్టెంబర్‌ 7న లేఖ రాశారు. 2021,డిసెంబర్‌ 7న సిఐడి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, వెనువెంటనే 2021, డిసెంబర్ 13న స్కిల్‌ కార్పొరేషన్‌కు డైరెక్టరుగా పనిచేసిన గంటా సుబ్బారావును తొలి నిందితునిగా అరెస్టు చేసింది. కాగా షెల్‌ కంపెనీలన్నీ సింగపూర్‌, ఇతర దేశాల బేస్డ్‌ కావడంతో మనీలాండరింగ్‌ జరిగిందంటూ ఈడీ రంగంలోకి దిగింది. ఐటీ చంద్రబాబుకు నోటీసు ఇచ్చింది. కేసులో 22వ నిందితునిగా ఉన్న యోగేష్‌ గుప్తా, మనోజ్‌ వాసుదేవ పరదేశి మధ్య ఆర్థిక లావాదేవీలు ఆ నోటీస్‌కు ఆధారం. దీంతో, కేంద్ర విచారణ సంస్థలే ఈ కేసులో ఏపీ సీఐడీకి ఉప్పందించాయని..అందుకే జగన్ సర్కార్‌ ఇక చంద్రబాబును ఉపేక్షించకుండా అరెస్ట్ చేయించిందని తెలుస్తోంది.

చంద్రబాబును అరెస్ట్ చేస్తే సింపతీ డ్రామా ఆడి ప్రజల్లో సానుభూతి తెచ్చుకుంటాడని జగన్ సర్కార్ కూడా భావించింది..అందుకే రెండేళ్లుగా..స్కిల్ స్కామ్‌లో అసలేం జరిగిందో కూలంకుశంగా దర్యాప్తు చేసిన ఏపీ సీఐడీ…కేంద్రం పరిధిలోని ఐటీ, ఈడీ సంస్థలు ఇచ్చిన ఆధారాల మేరకు చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది..అందుకే చంద్రబాబుకు కూడా తాను అడ్డంగా ఇరుక్కుపోయానని భావించాడు..అందుకే రాజమండ్రి సెంట్రల్ జైలులో తాను ఎన్నాళ్లు ఉంటే అది పార్టీకి అంత మైలేజీ అని బెయిల్ పిటీషన్లను కూడా సీరియస్‌గా తీసుకోవడం లేదు..
ఒకవేళ అరెస్ట్ అయి జైలుకు కొన్నాళ్లపాటు వెళితే సింపతీ వేవ్‌లో ఈజీగా అధికారంలోకి వస్తానని…ఒక వేళ బెయిల్ వచ్చినా…ఇది జగన్ సర్కార్ కక్ష పూరిత చర్య అంటూ ప్రజల్లో భావోద్వేగాలు రగిలించే ప్రయత్నం చేయాలని బాబుగారు ఫిక్స్ అయ్యాయి…అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇచ్చిన ఆధారాలతో కేసు బలంగా ఉందని..చంద్రబాబు అవినీతి కేసులో జైలుకు వెళితే అది టీడీపీ ఇమేజ్‌కు డ్యామేజీ అనే వాదన కూడా టీడీపీలో జరుగుతోంది..ఇన్నాళ్లు చంద్రబాబు అరెస్ట్ జగన్ కుట్ర అంటూ విషం కక్కిన టీడీపీ నేతలు, పచ్చమీడియా..అసలు సీఐడీకి ఉప్పందించిన కేంద్ర సంస్థల గురించి పల్లెత్తు మాట అనకపోవడం గమనార్హం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat