టీడీపీ హయాంలో తాత్కాలిక భవన నిర్మాణాల పేరుతో బోగస్ కాంట్రాక్టుల నుంచి ప్రజల సొమ్మును దారి మళ్లించి ప్రతిగా షాపూర్జీ పల్లోంజీ గ్రూపు నుంచి వందలాది కోట్లు తన చేతికి మట్టి అంటకుండా..బినామీల ద్వారా కొట్టేసిన చంద్రబాబు ఇప్పుడు ఐటీ శాఖ సోదాల్లో అడ్డంగా దొరికిపోయాడు..రూ. 118 కోట్ల బ్లాక్ మనీకి వివరణ ఇవ్వాలంటూ కేంద్రం పరిధిలోని ఐటీ శాఖ చంద్రబాబుకు 46 పేజీల నోటీసులు ఇచ్చింది..అయితే చంద్రబాబు మాత్రం తనపై వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టిందని…ఎన్ని అరాచకాలు చేసినా నిప్పులా బతికానని, 2, 3 రోజుల్లో తనను అరెస్ట్ చేసి కుళ్లబొడుస్తారంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజల్లో సానుభూతి కొట్టేందుకు తనకు అలవాటైన సింపతీ డ్రామా మొదలెట్టాడు..
అయితే తాజాగా చంద్రబాబు అరెస్ట్ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని మండిపడ్డారు. …తప్పు చేస్తే అరెస్టు చేయక ముద్దుపెట్టుకుంటారా అంటూ చంద్రబాబకు కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. .అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి పనులు చేస్తే అరెస్ట్ చెయ్యక ముద్దు పెట్టుకుంటారా? తుప్పు నాయుడు అంటూ ఫైర్ అయ్యారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. పాలు, పెరుగు అమ్మితే పదివేల కోట్ల ఆదాయం వచ్చిందా అని చంద్రబాబు ఆదాయ లెక్కలపై నిలదీశారు. పాలు, పిడకలు అమ్మి దేశంలో ఎవరూ ఇంత ఆదాయం సంపాదించలేదని, దోచుకున్న డబ్బును వైట్ చేసేందుకే చంద్రబాబు పాల వ్యాపారం చేస్తున్నారని కొడాలి నాని అన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు మనం చేసిన మంచి పనులు ఏవైనా ఉంటే వాటి గురించి ప్రజలు చెప్పాలి.. అంతే తప్ప చంద్రబాబు సెల్ఫీలు తీసుకొని అన్నీ నేనే చేశానని చెప్పుకోవడమేంటో నాకైతే అర్ధం కాలేదని చురకలు అంటించారు.. మాట్లాడితే హైదరాబాద్ నేనే కట్టానంటారు కానీ చంద్రబాబు అక్కడ పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదని ఎద్దేవా చేశారు. . పిట్టలదొర లేని లోటుని చంద్రబాబు తీరుస్తున్నారని కొడాలి నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో చంద్రబాబు గ్యాంగ్ లోని ఐదుగురు వ్యక్తులు మాత్రమే సంపదని దోచుకోవాలని కుట్రలు పన్నుతున్నారని కొడాలి నాని ఆరోపించారు. మొత్తంగా రూ. 118 కోట్ల స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ భయంపై మాజీ మంత్రి కొడాలి నాని అదిరిపోయే కౌంటర్ ఇచ్చారనే చెప్పాలి.