Home / ANDHRAPRADESH / విజయమ్మపై ఇవేమి తప్పుడు కూతలు..ఛీఛీ..మరీ ఇంతదిగజారుడుతనమా..చంద్రబాబు..!

విజయమ్మపై ఇవేమి తప్పుడు కూతలు..ఛీఛీ..మరీ ఇంతదిగజారుడుతనమా..చంద్రబాబు..!

టీడీపీ హయాంలో అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణాల పేరిట జరిగిన 118 కోట్ల ముడుపుల బాగోతంలో ఐటీ నోటీసుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు అరెస్ట్ భయం పట్టుకుంది..
అందుకే కేంద్రం పరిధిలోని ఐటీ శాఖ నోటీసులు ఇస్తే తనపై జగన్ సర్కార్ కక్ష కట్టిందని, 2, 3 రోజుల్లో తనను అరెస్ట్ చేస్తారు..దాడులు కూడా చేస్తారంటూ తెలుగు తమ్ముళ్లను రెచ్చగొట్టి ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చి ఈ కేసు నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు..మరోవైపు బాబు ష్యూరిటీ.. ఏపీ భవిష్యత్తుకు గ్యారెంటీ…అంటూ ఊరూరా తిరుగుతున్నా..చంద్రబాబుకు ముందు తన గెలుపుపై ష్యూరిటీ లేదు..టీడీపీ భవిష్యత్తుకు గ్యారంటీ లేదు అంటూ లోలోపల ఫ్రస్టేషన్ కు గురవుతున్నారు..అందుకే తన పెద్దరికాన్ని కూడా వదిలి సీఎం జగన్ పై ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్నారు.

తాజాగా ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న చంద్ర‌బాబునాయుడు బ‌హిరంగ స‌భ‌లోనే జ‌గ‌న్‌పై తీవ్ర అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. నీ పుట్టుకే త‌ప్పుడు పుట్టుక” అని సీఎం జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు అభ్యంత‌ర‌క‌ర కామెంట్ చేశారు. అంటే పరోక్షంగా వైఎస్ సతీమణి, స్వయాన సీఎం జగన్ తల్లిగారైన విజయమ్మను కించపర్చారు..గతంలో లోకేష్ పుట్టుకపై తమ పార్టీ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నోరుజారడంతో త‌న భార్య‌ను అవ‌మానించార‌ని ప్రెస్ మీట్ పెట్టి మరీ వెక్కివెక్కి ఏడ్చిన చంద్ర‌బాబు ఇప్పుడు జగన్ పుట్టుక తప్పుడు పుట్టుక అంటూ పరోక్షంగా విజయమ్మపై తప్పుడు కూతలు కూశారు.  సీఎం జగన్ పుట్టుకపై చంద్రబాబు తప్పుడు కూతలపై హిందూపుర వైఎస్ఆర్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తో సహా పలువురు నేతలు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు వ్యాఖ్య‌లు జ‌గ‌న్ మాతృమూర్తి వైఎస్ విజ‌య‌మ్మ‌ను కించ‌ప‌రిచేలా ఉన్నాయ‌ని మండిపడ్డారు. చంద్ర‌బాబు క‌డుపుకు అన్నం తింటున్నారా? లేక ఇంకేమైనా తింటున్నారా? అని గోరంట్ల ఫైర్ అయ్యారు. వయసు పెరిగే కొద్ది హుందాతనం పెరగాలని..కానీ చంద్రబాబులో చిల్లరతనం పెరిగిందని…ఆయన్ని మ‌హిళా లోకం క్ష‌మించ‌ద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. వెంటనే ముక్కు నేల‌కు రాసి చంద్ర‌బాబు జగన్ కుటుంబానికి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని, లేకుంటే అనంత‌పురం జిల్లాలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకుంటామ‌ని గోరంట్ల మాధవ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

తన కుమారుడు లోకేష్ పుట్టకపై వల్లభనేని వంశీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడంటూ గుక్క పట్టి వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు..ఇప్పుడు జగన్ పుట్టుకపై తప్పుడు కూతలు కూస్తూ..విజయమ్మ వ్యక్తిత్వాన్ని కించపర్చడంపై ఏమంటారు..ఛీఛీ..అధికారం కోసం తన భార్యను అవమానించారంటూ చంద్రబాబు..తన తల్లిని అవమానించారంటూ..లోకేష్..ఇప్పటికీ తమ ఇంటి గౌరవాన్ని బజారుకీడుస్తున్నారు..ఇప్పుడు ఏకంగా జగన్ పుట్టుకను అవమానిస్తూ..ఆయన తల్లిగారైన విజయమ్మను అవమానిస్తున్నారు..చీఛీ..మరి ఇంత దిగజారుడుతనమా చంద్రబాబు..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat