సెప్టెంబర్ 2..తెలంగాణ ప్రజలు ఈరోజును ఎప్పటికీ మర్చిపోరు..2009 లో రెండోసారి అఖండ విజయం సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయిన వైఎస్ ఆర్ కొద్ది నెలలకే రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ..హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ప్రజానేత మరణం తట్టుకోలేక నాడు వందలాది గుండెలు ఆగిపోయాయి..వైఎస్ ఆర్ భౌతికంగా లేకున్నా…ఆయన అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్ మెంట్ వంటి పథకాలతో తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వైఎస్ఆర్ బతికి ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయే పరిస్థితి ఉండేది కాదని..ఇప్పుడు ఏపీలో ఎవరిని అడిగినా చెబుతారు..వైఎస్ఆర్ మరణం తర్వాత ఓదార్పు యాత్ర చేపట్టిన ఆయన తనయుడిని కాంగ్రెస్ హైకమాండ్ అడ్డుకుంది..దీంతో సోనియమ్మతో విబేధించిన జగన్ తన తండ్రి పేరుతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ప్రజల ఆదరణ పొందారు. దీంతో నాటి టీడీపీ అధినేత చంద్రబాబు చీకట్లో నాటి హోం మినిష్టర్ చిదంబరం, సోనియాగాంధీతో కలిసి జగన్ పై అక్రమాస్తుల కేసుల మోపి 16 నెలలు జైలుకు పంపించారు.అయినా మొక్కవోని ధైర్యంతో పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లిన జగన్ 2014 ఎన్నికల్లో విజయం సాధించలేకపోయినా…బలమైన ప్రతిపక్ష నేతగా అవతరించారు. 2014 నుంచి చంద్రబాబు అసమర్థ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రమంతటా పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రిగా నవరత్నాల పథకాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ తండ్రిని మించిన తనయుడిగా పేరుగాంచారు.
నేడు దివంగత నేత వైఎస్ ఆర్ వర్థంతి సందర్భంగా రాష్ట్రమంతటా ఘననివాళులు అర్పిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఇడుపుల పాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన ప్రార్థనల్లో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తండ్రిని తలుచుకుని జగన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సతీసమేతంగా ఇడుపులపాయకు వెళ్లిన సీఎం జగన్, తల్లి విజయమ్మ, మరికొందరు కుటుంబసభ్యులు, మంత్రులతో కలిసి వైఎస్సార్ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.అంతకు ముందు తన ట్విట్టర్ ఖాతాలో తండ్రి వైఎస్ఆర్ ను తల్చుకుంటూ జగన్ తీవ్ర భావోద్వేగపూరిత ట్వీట్ చేశారు. నాన్నా… మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. భౌతికంగా మా మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్ మీరు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయి. మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి. వర్ధంతి సందర్భంగా మీకు ఘనంగా నా నివాళులు నాన్నా అంటూ జగన్ చేసిన ఎమోషనల్ ట్వీట్ తండ్రిపై జగన్ కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తోంది. ప్రస్తుతం దివంగత మహానేత వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా జగన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..వైసీపీ శ్రేణులు, జగన్ అభిమానులు తమ ప్రియతమ నేతకు పెద్ద ఎత్తున ఘననివాళులు అర్పిస్తూ..వైఎస్సార్ ప్రజలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.