ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన స్వర్గీయ ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమంపై వివాదం చెలరేగుతోంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీ ఆధ్వర్యంలో పూర్తిగా టీడీపీ కార్యక్రమంలా జరిగిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమానికి తనకు ఆహ్వానం పంపకపోవడంపై స్వయాన ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ పెట్టి మరీ పురంధేశ్వరి, నారా భువనేశ్వరీలే అసలు విలన్లు అని…చంద్రబాబుతో కలిసిపోయిన పురంధేశ్వరీ కుట్రలకు పాల్పడుతోందని మండిపడ్డారు…తన తండ్రి చావుకు కారకుడైన చంద్రబాబుతో కుమ్మక్కైన పురంధేశ్వరీ సీఎం జగన్ పై కుట్రలు చేస్తుందని…ఏపీ బీజేపీని మళ్లీ టీడీపీకి తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తుందంటూ లక్ష్మీ పార్వతి తీవ్ర విమర్శలు గుప్పించారు. కాగా తనకు ఆహ్వానం పంపకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతి భవన్ కు లక్ష్మీ పార్వతి లేఖలు రాసారు. ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమంపై వివాదం చెలరేగడంతో కేంద్ర ప్రభుత్వం డ్యామేజీ కంట్రోల్ కు దిగింది…రిజర్వ్ బ్యాంకు అచ్చు వేసిన నాణేంను ఎవరైనా విడుదల చేసుకోవచ్చు అని…అలాగే పురంధేశ్వరీ రాష్ట్రపతిని రిక్వెస్ట్ చేసి ప్రైవేటు కార్యక్రమంగా నిర్వహించారే కానీ..ఇది కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించలేదని స్పష్టం చేసింది. అంతే కాదు కేంద్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలకు కచ్చితంగా ఆహ్వానం పంపిస్తామని లక్ష్మీ పార్వతికి వివరణ ఇచ్చింది.
అయితే ఇదే విషయమై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వచ్చిన ఉండవల్లని ఎన్టీఆర్ నాణేం విడుదల కార్యక్రమం వివాదంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అయితే ఆ కార్యక్రమాన్ని నేను చూడలేదని ఆయన అన్నారు. కాగా చంద్రబాబు, నడ్డాతో భేటీ అవడంపై స్పందిస్తూ…బీజేపీ, టీడీపీ మళ్లీ పొత్తులు పెట్టుకుంటే ఆశ్చర్యం ఏముంది…గతంలో చాలా సార్లు ఆ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకుని పోటీ చేశాయి కదా…రాజకీయ అవసరాల నిమిత్తం టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు పెట్టుకున్నా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు. ఇక లక్ష్మీ పార్వతికి ఆహ్వానం పంపకపోవడం దారుణమని పురంధేశ్వరి తీరును ఉండవల్లి తప్పు పట్టారు..ఎన్టీఆర్ ని ఆఖరి రోజుల్లో కొడుకులు, కూతుళ్లు ఎవరూ పట్టించుకోలేదని, కనీసం అన్నం కూడా పెట్టలేదని, అనారోగ్యంతో ఉన్ ఎన్టీఆర్ కు లక్ష్మీ పార్వతి సేవలు చేసింది..ఆమె వల్లే తాను బతికానని స్వయంగా ఎన్టీఆర్ అప్పట్లో చెప్పిన విషయాన్ని ఉండవల్లి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతే కాదు లక్ష్మీ పార్వతి స్వయంగా ఎన్టీఆర్ సతీమణి…ఏ రిజిష్టర్ మ్యారేజో కాదు..తిరుపతిలో లక్షలాది ప్రజల ముందు ఆయన తాళి కట్టారు..కాబట్టి లక్ష్మీ పార్వతి ముమ్మాటికీ ఆయన సతీమణే అని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ స్మారక నాణేం కార్యక్రమానికి లక్ష్మీ పార్వతిని పిలవకపోవడం చాలా దారుణం..ఇది కరెక్ట్ కాదు.. పురంధేశ్వరీ చాలా తప్పు చేసిందంటూ ఉండవల్లి అన్నారు. మొత్తంగా ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమంపై ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.