తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతోందని ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. ఈరోజు మంగళవారం ఆలేరు పట్టణంలో వైఎస్సార్ గార్డెన్ లో బీసీ బంధు పథకం కోసం ఎంపిక చేసిన 300 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు.చేతి వృత్తి దారులకు చేయూతనిస్తూ ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు.
మళ్లీ ఆ పార్టీకి ఒటేస్తే ప్రజల జీవితాలు చీకట్లోనే మగ్గాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మహేందర్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.