తెలంగాణ రాష్ట్ర సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబర్ నెలలో 4న నిర్వహించిన పరీక్షను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు రద్దు చేసింది.
గతంలో నిర్వహించిన ఈ పరీక్ష నిర్వహణలో లోపాలను ఎత్తిచూపుతూ అభిలాష్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం ఇప్పటికీ ఫలితాలు విడుదల చేయలేదు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నోటిఫికేషన్, పరీక్షలను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.