ములుగుజిల్లా మల్లంపల్లి మాజీ జెడ్పి చైర్మన్ కి,శే, కుసుమ జగదీశ్ చిత్రపటానికి రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ. ప్రకాశ్, పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత పూల మాల వేసి నివాళులర్పించారు.
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంపించిన ఒక కోటి 50 లక్షల చెక్కును కి.శే. జగదీష్ కుటుంబ సభ్యులకు మంత్రి అందజేశారు.
విద్యార్థులు చదువులతో పాటు వారి కుటుంబానికి పార్టీ తరఫున అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడేనాగ జ్యోతి, రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి, భద్రాచలం బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకటరావు, మరియు బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.