కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రింగ్ బస్తి లింగాయత్ భవనంలో శ్రావణమాస బసవజ్యోతి కార్యక్రమంలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అన్నింటిలో వెనుకబడిన వీరశైవ లింగాయత్ ల సంక్షేమం, అభివృద్ధికి బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలో ఉన్న వీరశైవ లింగాయత్ లు అన్ని రంగాల్లో అభివృద్ధి అవుతున్నారంటే కారణం సీఎం కేసీఆర్ గారి చలవేనన్నారు.
నియోజకవర్గంలోని వీరశైవ లింగాయత్ లు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా తన వంతు కృషి తప్పకుండా చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ స్వామి, హిమాలయ పీఠాధిపతి, తెలంగాణ లింగాయత్ ప్రెసిడెంట్ డెంపే కృష్ణ , బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అద్యేక్షులు రుద్ర అశోక్, సీనియర్ నాయకులూ సయీద్ రషీద్, సంజు, బస్వారాజ్, రణ్వీర్, ధర్మేందర్, రమేష్, వీరయ్య స్వామి, కపిల్, హనుమంతు, శివరాజ్,