తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడ నుండి బరిలోకి దిగనున్నారో తెలియజేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు.
అందులో భాగంగా గాంధీభవన్ లో హుస్నాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా బరిలోకి దిగడానికి దరఖాస్తు చేశారు పొన్నం ప్రభాకర్. గత పదేండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేశారని ఆయన విమర్శించారు.