కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్ లో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దైవచింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు మురళి యాదవ్, విష్ణు, ధర్మ రెడ్డి,ఎస్.వీ. సురేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శేఖర్ మరియు ఆలయ కమిటి సభ్యులు స్థానిక నాయకులు పాల్గొన్నారు