కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125గాజులారామారం డివిజన్ పరిధిలోని గాజులరామారం మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బాడీ బీస్ట్ జిమ్ ను ఈ రోజు ఎమ్మెల్సీ నవీన్ రావు గారు, ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారు,ముఖ్య అతిథిలుగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ. నేటి యాంత్రిక దిన చర్యలలో భాగంగా వ్యాయామం శారీరానికి మరియు మనస్సుకు ప్రశాంతతను ఇస్తుందని, ప్రతీ ఒక్కరు రోజు తప్పకుండ వ్యాయామం చేసి ఆరోగ్యాంగా వుండాలని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులూ కస్తూరి బాలరాజ్, కమలాకర్, శ్రీనివాస్ యాదవ్, మఖ్సూద్ అలీ, సింగారం మల్లేష్, ఇబ్రహీం,మూస ఖాన్, ఇమ్రాన్ బేగ్,వాహీద్ కార్తీక్, నిర్వాహకులు సునీల్ కుమార్, కృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు.