ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోనిగొర్రెకుంటక గ్రామంలో 200 యాదవ కుటుంబాలు గ్రామ పార్టీ ఆధ్వర్యంలో పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి రెడ్డి గారి సమక్షంలో ఏకగ్రీవ తీర్మానం చేస్తు బి.ఆర్.ఎస్.లో చేరారు. వారికి ఎమ్మేల్యే గారు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మేల్యే గారు మాట్లాడుతూ… బిఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందలంటే బిఆర్ఎస్ పార్టీకే మద్దతివ్వాలన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు.రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీకి ఎనలేని ఆదరణ లభిస్తుందన్నారు. నిరు పేదల సంక్షేమానికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపడుతుందన్నారు. అన్ని వర్గాల వారికి కేసీఆర్ సముచిత న్యాయం కల్పిస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా యాదవ కులస్థులకు సీఎం కేసీఆర్ గారు ఆర్దికంగా ఆదుకుంటూన్నారని తెలిపారు.దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సర్కారు అన్ని వర్గాల ప్రజల కోసం అహర్నిశలు కృషిచేస్తున్నదన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకొని పలు రాష్ర్టాలు అమలు చేస్తున్నాయన్నారు. మన సంక్షేమ పథకాలే దేశానికి దిక్సూచిలా మారడం గర్వించదగ్గ విషయమన్నారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.పార్టీలో చేరిన వారిలో.. మ్యాదరబోయిన వెంకటేశ్వర్లు,ముక్కెర రవి,యాదవ సంఘం అధ్యక్షులు పెరబోయిన రాజు,కాసాని సమ్మయ్య,జక్కుల బాబు,బైకాని కోమురెల్లి,గాజు మల్లేశం, యుగెందర్,కాసాని రాజు,గాజు రమేష్,శ్రీను,బొంతల సాంబయ్య,కీర్తి అఖిల్,గాజు సురేష్,రమేష్,కాసాని రాములు,చేరాలు,సాంబయ్య,బికాని బిక్షపతి, పెరబోయిన పవన్,పిండి మహేష్,జక్కుల రాజు,కిరణ్,గాజు సతీష్,రాజు,పిండి యాదగిరి,గాజు సరోజన,మ్యాకల అనిత,బురం భాగ్యం, మ్యాకల ఐలమ్మ,గడ్డబోయిన పద్మ,రాజమ్మ తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, డివిజన్ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.