ప్రముఖ పాత్రికేయుడు, సంపాదకులు సిహెచ్ ఎంవీ కృష్ణారావు మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనను కలిచి వేసిందని పేర్కొన్నారు.
సుధీర్ఘ కాలంగా కృష్ణారావుతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. జర్నలిజంలో కృష్ణారావు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని ప్రార్థించారు.