కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో చోటుదక్కింది. ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ఇంటిపేరు వ్యవహారంలో రాహుల్ గాంధీ అనర్హతకు గురైన సంగతి తెల్సిందే.
దీంతో ఆయన దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు తీర్పుతో మళ్లీ లోక్‌సభలోకి ప్రవేశించారు. సభ్యత్వం పునరుద్ధరించిన వారం వ్యవధిలోనే రాహుల్ గాంధీ డిఫెన్స్‌పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నామినేట్ కావడం విశేషం.
ఈ మేరకు లోక్‌సభ బులెటిన్ విడుదల చేసింది. కాగా, పార్లమెంటు నుంచి అనర్హత వేటు పడటానికి ముందు కూడా అదే కమిటీలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. రాహుల్‌తోపాటు కాంగ్రెస్ ఎంపీ అమర్ సింగ్ కూడా కమిటీకి నామినేట్ అయ్యారు.