నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు..ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు.
ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎటువంటి సమస్యలు ఉన్నతన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారంలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే గారు తెలిపారు.