ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఆంధ్ర నాయకులతో కొట్లడి ఆరోజు ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించి రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలకు మతాలకు సమ న్యాయం చేస్తున్న తరుణంలో ఇటీవల ప్రారంభించిన బీసీ కుల వృత్తులకు రూ. 1,00,000/- సహాయం పథకంలో భాగంగా ఈరోజు బోథ్ మండలంలోని సాయి ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన బీసీ కుల వృత్తుల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు ముఖ్యఅతిథిగా హాజరయి మొదటి విడతగా బోథ్ నియోజకవర్గంలోని 300 మంది బీసీ సోదరులకు రూ. 1,00,000/- చొప్పున అందజేశారు.
అనంతరం బోథ్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 30 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారు మాట్లాడుతూ ఆడ బిడ్డ పెళ్లికి రూ. లక్ష సహాయం చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు.
అదేవిధంగా బీసీ కుల వృత్తులకు రూ. లక్ష సహాయం చేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీసీ సోదరుల ఇండ్లలో వెలుగులు నింపారని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, బిసి ఆఫీసర్ రాజలింగు, బోథ్ అధికార ప్రతినిధి మొట్టే కిరణ్ కుమార్, జడ్పీటీసీ సంధ్యారాణి, సర్పంచ్ సురేందర్, మండల కన్వీనర్ నారాయణ రెడ్డి గారితో పాటు ఆయా మండలాల కన్వీనర్లు, ఎంపిపిలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపిటిసిలు నాయకులు పాల్గొన్నారు.