తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. త్వరలోనే ఉద్యోగుల వేతన సవరణ కమిషన్(PRC)తో పాటు మధ్యంతర భృతిని ప్రకటిస్తామని, EHS పక్కాగా అమలు చేస్తామని ఉద్యోగ సంఘాలతో జరిగిన భేటీలో ఆయన హామీ ఇచ్చారు.
2వ పీఆర్సీని ఏర్పాటు చేసి, 2023 జూలై 1 నుంచి అమలయ్యేలా ఐఆర్ ను ప్రకటించాలని ఉద్యోగులు కోరారు.. సీఎం సానుకూలంగా స్పందించారు. ఇవాళ లేదా రేపు అసెంబ్లీలో పీఆర్సీ కమిషన్, మధ్యంతర భృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది.