తెలంగాణలో ఉన్న రైతులను సంక్షోభంలోకి నెట్టాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని మంత్రి పువ్వాడ అజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో పగటిపూట కరెంట్ ఉండేదే కాదన్నారు.
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఏజెంట్ అని.. టీడీపీ ప్రొడక్ట్ అని ఆరోపించారు. రైతులకు 3 గంటల కరెంట్ వ్యాఖ్యలను మేనిఫెస్టోలో పెట్టే దమ్ము కాంగ్రెస్కు ఉందా? అని ప్రశ్నించారు.