కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జీవో 59 కింద దరఖాస్తు చేసుకున్న పేదలకు రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో తారతమ్యం రావడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి ఇబ్బంది లేకుండా న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారిని హైదరాబాద్ లోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి వహించి పునః పరిశీలన చేసి పేదలకు న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్యే గారు నవీన్ మిట్టల్ గారిని కోరారు.
