ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇవాళ పాదయాత్రలో భాగంగా పత్తికొండ నియోజకవర్గం చెరుకులపాడు చేరుకున్న ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రాజన్న తనయుడి రాక సందర్భంగా భారీగా జనం వేలాదిగా తరలివచ్చారు. అన్న వస్తున్నాడు అంటూ వైఎస్ జగన్‌కు జేజేలు పలికారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని, అధైర్యపడొద్దని వారికీ భరోసా ఇచ్చారు. అనంతరం అశేష ప్రజాభిమానం నడుమ అక్కడ పార్టీ జెండా ఆవిష్కరించారు. అలాగే ఎద్దుల బండి ఎక్కి చెర్నాకోలా చేతబట్టిన జగన్‌ను చూసి ప్రజలు పెద్ద పెట్టున నినాదాలు చేయగా, యువత ఉత్సాహంతో ఈలలు వేస్తూ తమ అభిమానం చాటుకున్నారు. అలాగే ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురైన పార్టీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి సమాధిని వైఎస్ జగన్ సందర్శించి, నివాళులు అర్పించారు.అనంతరం పత్తికొండ స్థానానికి ముందస్తుగా పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్న శ్రీదేవిరెడ్డిని ఎంపిక చేస్తున్నట్టు అయన ప్రకటించారు.. పత్తికొండ నియోజకవర్గం నుంచి శ్రీదేవి…వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఆమె భవిష్యత్‌ను మీ చేతుల్లో పెడుతున్నానంటూ….పాదయాత్ర సందర్భంగా అయన చెప్పారు. శ్రీదేవిరెడ్డి భర్త దివంగత చేరుకులపాడు నారాయణరెడ్డి 5 నెలల కిందట హత్యకు గురైన విషయం తెలిసిందే ..