సిద్దిపేట జిల్లాకు చెందిన తొలితరం కమ్యూనిస్టు నాయకులు, తెలంగాణ రైతాంగ పోరాట పోరాట యోధులు మాజీ MP సోలిపేట రామచంద్రారెడ్డి (92) అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ కీర్తించారు.
వారు సర్పంచ్ గా, సమితి అధ్యక్షుడిగా, దొమ్మాట శాసన సభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా, పలు హోదాల్లో విశిష్ట సేవలు అందించి మచ్చలేని వ్యక్తిగా పేరుపొందారన్నారు.
రామచంద్రారెడ్డి మరణం పట్ల రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ సంతాపం తెలిపారు. వారి ఆత్మ శాంతించాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.