గద్వాల నియోజకవర్గంలోని ధరూర్ మండల పరిధిలో చింత రేవుల గ్రామం నందు తెలంగాణ రాష్ట్ర అవతరణ దతాబ్ది ఉత్సవాల భాగంగా నిర్వహించిన మంచినీళ్ల పండగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు హాజరయ్యారు.ఎమ్మెల్యే గారికి గ్రామ సర్పంచ్ శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు .ఎమ్మెల్యే గారు , ప్రజా ప్రతినిధులు గ్రామ సర్పంచ్ ప్రజలు కలిసి గ్రామంలోని నీటి ట్యాంక్ వరకు ర్యాలీ ని నిర్వహించారు అనంతరం ప్రతిజ్ఞ చేశారు.
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…గ్రామ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాల శుభాకాంక్షలు….దశాబ్ద ఉత్సవాలు భాగంగా నేడు నీళ్ల పండగను జరుపుకునే జరుగుతుంది జూరాల ప్రాజెక్టుకు ప్రతి సమీపంలో ఉన్న గ్రామం చింతరేవుల గ్రామ ప్రజలు ఎంతో మందికి నీళ్ల దాహాన్ని తీర్చుతున్నారు. ప్రతి సమీపంలో మిషన్ భగీరథ వాటర్ షెడ్ నిర్మాణమైనది మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్ ద్వారా ఉచితంగా ప్రభుత్వం స్వచ్ఛమైన మంచినీటిని అందించడం జరుగుతుంది.
దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మారుమూల గ్రామంలో మంచి నీళ్లు ను ప్రతి ఇంటికి అందించిన ఏకైక నాయకుడు తెలంగాణ అపర భగీరథుడు సీఎం కేసీఆర్ గారిని గర్వంగా చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, ఎంపీపీ లు నజూమన్నీసా, బేగం, మనోరమ్మ జడ్పిటిసి రాజశేఖర్, వైస్ ఎంపీపీలు సుదర్శన్ రెడ్డి, రామకృష్ణ నాయుడు, సర్పంచ్ శిల్పా ప్రభాకర్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు