మన ఊరు మన బడి పథకంతో ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పాఠశాలలను బలోపేతం చేస్తుందని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. ఆదివారం చిలుకూరు మండల కేంద్రంలోని 7 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మన ఊరు-మన బడి మొదటి విడత పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……. గత పాలకవర్గాల నిర్లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలు పోయాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా రంగ రక్షణకు శ్రీకారం చుట్టిందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి పేద మధ్య తరగతి వర్గాల పిల్లలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తుందన్నారు అని ఆయన తెలిపారు. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు మన ఊరు మన బడి పథకం తో ఈ ఏడాది నుండి ఇంగ్లీష్ మీడియాం విద్యతో పాటు మౌలిక సదుపాయాలు అదనపు తరగతి గదులు, మంచినీటి సౌకర్యం, విద్యుత్తు మూత్రశాలలు, మరుగుదొడ్లు, కిచేన్ షెడ్లు, డైనింగ్ హాల్లు, ప్రహరీ గోడలు, డిజిటల్ క్లాస్ రూమ్స్ ల ఏర్పాటుకోసం లక్షల బడ్జెట్ను పాఠశాల విద్యా కమిటీ ఖాతాల్లో జమ చేసింది అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య తో పాటు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం వారానికి మూడు కోడి గుడ్లు ఉచితంగా పుస్తకాలు దుస్తులు అందజేస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈకార్యక్రమంలో ఎంఈఓ సలీం షరీఫ్, ఎంపీడీవో ఈదయ, మాజీ ఎంపీపీ బజ్జూరు వెంకట్ రెడ్డి, రైతు సమన్వయ సమితి నాయకులు అనంత సైదయ్య, ఎంపిటిసి బెల్లంకొండ రమణ నాగయ్య, మైనార్టీ సెల్ అధ్యక్షులు పాషా, గ్రామ పాలకవర్గ సభ్యులు, నాయకులు గన్న అశోక్, శోభన్, శ్రీనివాస్, గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.