తెలంగాణలో అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి, ఆరు పదులు దాటిన అవ్వల వరకు అందరినీ కంటికి రెప్పలా మనసున్నముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ కాపాడుతోందన్నారు మంత్రి కేటీఆర్.
‘ఆకాశంలో సగం కాదు.. ఆమే ఆకాశం. సంక్షేమంలో సగం కాదు.. ఆమే అగ్రభాగం. మహిళా సంక్షేమంలో మన తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికే ఆదర్శం’ అని అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా మంత్రి కేటీఆర్ ఈమేరకు ట్వీట్ చేశారు.