ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ట్విటర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే సంచలన ఆరోపణలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ‘రైతుల నిరసనను, ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్న వారి అకౌంట్లను బ్లాక్ చేయమని ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది.
లేదంటే దేశంలో ట్విటర్‌ను బ్లాక్ చేస్తామంది. మా కార్యాలయాలు మూసేస్తామని, ఉద్యోగుల ఇళ్లపై రైడ్స్ చేయిస్తామని (చేశారు కూడా) పేర్కొంది. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి’ అని డోర్సే అన్నారు.