సరిగ్గా పదహారు ఏండ్ల కిందట అంటే 2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో అప్పటి కెప్టెన్ ..టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనీ యంగ్ ప్లేయర్లతోనే గెలిపించాడని ఓ నెటిజన్ చేసిన ట్వీట్ పై టీమిండియా మాజీ ఆటగాడు .. ఆప్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వ్యంగ్యంగా స్పందించారు.
నెటిజన్ చేసిన ట్వీట్ పై హర్బజన్ స్పందిస్తూ ‘అవును.. అతనొక్కడే ఒంటరిగా ఆడాడు. మిగతా 10 మంది ఆడలేదు. ఆస్ట్రేలియా లేదా మరేదైనా దేశం ప్రపంచకప్ గెలిస్తే ఆ టీం మొత్తం గెలిచిందని అంటారు.
కానీ ఇండియాలో మాత్రం కెప్టెన్ ఒక్కడే గెలిపించినట్లు చెబుతారు. ఇది ఒక టీం గేమ్. ప్లేయర్లు కలిసి గెలుస్తారు, కలిసి ఓడిపోతారు’ అని తన అధికారక ట్విట్టర్ లో హర్భజన్ సింగ్ ట్వీట్ చేశారు.