Home / SLIDER / ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి…

ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి…

జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్, ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో గౌడా రమేష్ ఈఎన్టీ హాస్పిటల్ వారి సహకారంతో శనివారం భారత నగర్ జిహెచ్ఎంసి కమ్యూనిటీ హాల్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు .అనంతరం కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ మాట్లాడుతూ డివిజన్ లో ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్న లక్ష్యంతో దశల వారీగా కాలనీలలో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ఈ శిబిరంలో సుమారు 120 మంది స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని కార్పొరేటర్ తెలిపారు. ఉచిత వైద్య శిబిరం నిర్వహించడానికి సహకారం అందించిన గౌడా రమేష్ ఈఎన్టీ హాస్పిటల్ యాజమాన్యానికి మరియు డాక్టర్లకు కార్పొరేటర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

గౌడా రమేష్ ఈఎన్టీ హాస్పిటల్ అధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరంలో చెవి, ముక్కు, గొంతు రుగ్మతలకు సంబంధించిన ఖరీదైన వైద్య పరీక్షలు నిపుణులైన వైద్యం బృందం అధ్వర్యంలో నిర్వహించి ఉచితంగా మందులు ఇచ్చి పూర్తి సహకారం అందించిన గౌడా రమేష్ ఈఎన్టీ హాస్పిటల్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి ఉచిత వైద్య శిబిరాలను ప్రజలకు అందుబాటులో డివిజన్ పరిధిలో అన్ని కాలనీలలో ఏర్పాటు చేయడం కొరకు కృషి చేస్తున్నామన్నారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ సూచించారు.,గౌడ రమేష్ ENT హాస్పిటల్ వై జంక్షన్ కూకట్ పల్లి డాక్టర్ గౌడ రమేష్ ఏంఎస్ ENT, డాక్టర్ హాసిని ఏంఎస్ ENT, ప్రకాష్ రావు మనేజర్, శ్రీధర్, సంతోష్.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat