మూడుముళ్లబంధం..ఏడు అడుగులతో ఇరువురిని ఒకటిచేసే సుమూహుర్తాలు ఆరు మాత్రమే వుండటంతో రాష్ట్రమంతటా వేలాది జంటలు వేదమంత్రాల నడుమ దంపతులుగా మారుతున్నారు. కార్తీక మాసం వెళ్లి , మార్గశిర మాసం ప్రారంభ మైంది.అయితే డిశేంబర్ 1నుండి, 2018 ఫిబ్రవరి 18 వరకు శుక్ర మౌడ్యమి వుండటంతో,శుభకార్యలు చేసేందుకు ముహుర్తాలు లేక పోవడంతో గురువారం నుండి 24,25,26,29,30 వరకు పెళ్లి భజంత్రీలు,గృహ ప్రవేశాలు విరివిగా జరుగుతున్నాయి.
దీంతో ఈ తేదీల్లోనే పలు ఆహ్వానాలు అందుకున్నవారు ఎలాగైనా మాటనిలుపుకోవాలని, కుటుంబసభ్యులు ఒక్కరోక్కరుగా హాజరు కావాల్సోస్తుందని అంటున్నారు. ఇదే సమయంగా ప్రతి వస్తువు, అవసరమైన బ్యాండు, డిజే, మైకు, టెంటుసామాన్లు, ఫంక్షన్ హాల్లు తదితర వాటికై ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సివస్తోందని వాపోతున్నారు.ఎట్టకేలకు శుభకార్యలకు హాజరుకావడం అదే సమయంలో దూరపు, దగ్గరి బంధువులు, స్నేహి తులను కలుసుకోవడం ఒకింత ఆనందాన్ని పొందుతామంటున్నారు.
Tags Marriage matrimony spouses wedlock