ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ కి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ కు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు విజయవాడలోని రమేశ్ ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. యాంజియోగ్రామ్ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.