కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని ముత్యాల బస్తీలో నూతనంగా నిర్మించిన శ్రీ పోచమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. పోచమ్మ తల్లి దీవెనలు ప్రజలందరిపై తప్పక ఉంటాయన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధిలో ఎల్లప్పుడూ ముందుంటానని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నవనీత్, విష్ణువర్ధన్ రెడ్డి, కృష్ణ, శంకర్, నాయకులు యూసుఫ్, ప్రభాకర్, అమరేందర్ రెడ్డి, కావలి రవి, బైరేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.