ఏపీలో రాజకీయ పకరిణామాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. ఇక తాజాగా కృష్ణా జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగలడం ఖాయమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. విజయవాడ ఘన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని వీడనున్నారనే వార్తలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
అసలు విషయం ఏంటంటే.. టీడీపీ యువనాయకుడు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తరపున యాక్టీవ్ గానే ఉన్నారు. అయితే పార్టీలో ఆయనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో.. గత కొద్ది నెలలుగా ఆయన పార్టీలో అంతగా క్రియాశీలక పాత్ర పోషించడం లేదు. తాను చెప్పిన పనులు చేయడంలో అధికారులు అలసత్వం వహించడం.. సర్కారు ముందుకు తీసుకువెళ్లకపోవడం వంశీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక ఇటీవల షుగర్ ఫ్యాక్టరీ తణుకు తరలింపు అంశం పై రైతులు పలుసార్లు వల్లభనేనిని కలిసి తమగోడు వెళ్లబోసుకున్నారు.. దీనిపై సీఎంతో మాట్లాడి సమస్య పరిష్కరించాలి అని అనుకున్నారు, కాని దానికి అవకాశం దొరక్కపొవడంతో.. వంశీ రాజీనామాకు సిద్దమయ్యారు, చివరకు ఆయన రాజీనామా అంశం తెలియడంతో లోకేశ్ వెంటనే మంత్రి కళాని పంపించి ఆయన చేత రాజీనామా లేఖను వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే పార్టీలో ఆయనకు కొద్ది రోజులుగా జరుగుతున్న అవమానాన్ని ఆయన తెలియచేశారని తెలుస్తోంది. అంతే కాకుండా వైసీపీ నాయకులు.. కొడాలి నాని వంగవీటి రాధాతో వంశీ టచ్లో ఉన్నారని.. ఆయన త్వరలో వైసీపీలో ఎంట్రీ ఇచ్చినా ఆశ్యర్యపోవక్కర్లేదంటున్నారు వైసీపీ నేతలు. ఇటీవల గన్నవరం బాధ్యతలు వైసీపీలో కొత్త వారికి అప్పగించినా వల్లభనేని పార్టీలో చేరితే ఆయనకు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయని చెబుతున్నారు వైసీపీ నాయకులు. ఇక జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాకి వచ్చేలోపే వల్లభనేని వంశీ ఒక నిర్ణయానికి రానున్నారని.. దీంతో వంశీ దారెటో తేలిపోనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.