ప్రముఖ సినీ నటుడు నిర్మాతకు హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు జైలు శిక్ష విధిస్తూ షాకింగ్ తీర్పు ఇచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూరీ దర్శకత్వంలో గణేష్ టెంపర్ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రానికి ప్రముఖ రచయిత వక్కతం వంశీ కథని అందించిన విషయం తెలిసిందే. అయితే తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వలేదంటూ రచయిత వక్కంతం వంశీ కోర్టును ఆశ్రయించారు.
దీంతో కొన్ని రోజులుగా విచారణలో ఉన్న ఈ కేసుపై హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. నష్ట పరిహారం కింద వంశీకి రూ. 15,86,550 చెల్లించాలని బండ్ల గణేష్‌ను కోర్టు ఆదేశించింది. నిర్లక్ష్యంగా వహించినందుకు ఆయనపై 6 నెలల జైలు శిక్ష కూడా విధిస్తూ తీర్పు చెప్పింది. తీర్పు అనంతరం బండ్ల గణేష్ బెయిల్‌కు దరఖాస్తు పెట్టుకోగా.. జడ్జి బెయిల్ మంజూరు చేశారు. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్లో సంచలనంగా మారింది.