తమిళ్ హీరో కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ఏ విషయం పై అయినా చాలా బోల్డ్‌గా మాట్లేడేస్తుంది. ఐరన్ లెగ్గా మొదట ముద్ర పడిన శృతికి ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోయింది. ఇక ఆమేకి వివాదాలు కూడా ఎక్కువే అని చెప్పాలి. ఇటీవల శృతి గురించి పెళ్లి కాకముందే ప్రియుడుతో ముంబైలో కాపురం పెట్టిందని గాసిప్స్ వెలువడ్డాయి. ఆ తర్వాత తమిళ్ భారీ ప్రాజెక్ట్ సంఘమిత్ర నుంచి తప్పుకొని విమర్శలు ఎదుర్కొంది. అయితే ఆమె వాటన్నిటినీ చాలా లైట్ తీసుకొని పట్టించుకోలేదు. పైగా నా జీవితం నా ఇష్టం.. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు నాకు ఉందని.. అది ప్రేమ కావొచ్చు, సినిమా కావొచ్చు..అంటూ మీడియా ముందు రఫ్ఫాడించింది.
ఇక కొద్ది రోజుల క్రితం ప్రతి మనిషికీ అలవాట్లు ఉంటాయి. అలాంటి అలవాట్లే కొన్ని సార్లు వ్యసనాలుగా మారతాయి. అయితే నా విషయంలో అలా జరగదని కొన్ని రోజుల క్రితం సంచలన కామెంట్స్ చేసిన శృతి.. మరోసారి హాట్ కామెంట్స్ చేసింది. ఏ విషయంలో అయినా మొహమాట పడొచ్చు కానీ.. తెలియంది నేర్చుకోవడంలో అస్సలు మొహమాట పదొద్దని శ్రుతిహాసన్ కొత్త హీరోయిన్స్‌కి సూచన ఇచ్చింది. ఏ రంగంలోనైనా ఎవరికీ అన్నీ రావు.. నేర్చుకుంటూనే ఉండాలి.. ఇన్నేళ్ల నుంచి సినిమాల్లో ఉన్న నాకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. నేను ఏమీ పైనుంచి ఊడిపడలేదు . అందరిలాంటి అమ్మాయినే. నాకు వీలైనంతలో కష్టపడి నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాను. నేను స్టార్లతో చాలా సినిమాలు చేసేశాను కాబట్టి నాకు తెలియని విషయమే ఉండదు అనుకుంటే దానంత పొరపాటు మరొకటి ఉండదు. నాకు రాని విషయం గురించి ఎవరు చెప్పినా వింటాను. నాకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఏదోలా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. సిగ్గుపడనని చెప్పింది. దీంతో శృతి మాటలకు దక్షిణాది నటీమణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.