పసివాళ్ళు ఏం చేసినా ఆనందంగా అనిపిస్తుంది. పెద్దవాళ్లు ఏం చేసినా అభిమానంగా ఉంటుంది. ఆ ఇద్దరూ కలిసి ఏదైనా చేస్తే అది అత్యంత సంతోషాన్నిస్తుంది. ఇలాంటి ఘటనే ఒకటి పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగరలో శుక్రవారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో చోటు చేసుకుంది. బిఆర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో భాగంగా పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగరలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఎదురుగా కూర్చున్న పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజల్లోంచి ఒక పసిబాలుడు బిఆర్ ఎస్ పార్టీ జెండాను పట్టుకుని కనిపించాడు. వెంటనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ బాలుడిని తన వద్దకు పిలుచుకుని, జెండాను భుజానికెత్తుకున్న ఆ బాలుడిని తన భుజానికెత్తుకున్నారు. సంబురపడ్డారు. ఆ బాలుడి వివరాలు తెలుసుకున్నారు.
పెద్ద వంగర మండలంలోని పడమటి తండా గ్రామ పంచాయతీకి చెందిన ధరావత్ చిరంజీవి – సుమతిల కుమారుడు అక్షిత్, అతని నానమ్మ అఖిలీ తో కలిసి వచ్చాడు. అక్కడ జెండా కనిపిస్తే కావాలని అడగడంతో అక్షిత్ నానమ్మ ఆ జెండాను ఆ బాలుడికి ఇచ్చింది. ఆ బాలుడు కాస్త ఆ జెండాను పట్టుకుని మంత్రికి కనిపించడతో ఈ దృశ్యవ ఆవిష్కృతమైంది. ఆ పసివాడు జెండాను ఎత్తుకోవడం, ఆ జెండాను ఎత్తుకున్న ఆ పసివాడిని మంత్రి ఎర్రబెల్లి ఎత్తుకోవడం, ముద్దు చేయడం అందరినీ ఆకర్షించింది.