తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మార్గదర్శకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతున్నది.
జనవరి 18 నుంచి జూన్ 15 వరకు వంద రోజులపాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 85 శాతానికిపైగా కంటి పరీక్షలు పూర్తి అయ్యాయి. ఆదివారం నాటికి 74 రోజుల పనిదినాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒక కోటి 42 లక్షల 30 వేల 576 మందికి కంటి పరీక్షలను నిర్వహించారు.
దృష్టి లోపమున్న వారిని గుర్తించి 20 లక్షల 69 వేల మందికి ఉచితంగా కండ్లద్దాలు, మందులను అందజేశారు. మొత్తంగా 10 వేల 285 గ్రామపంచాయతీ వార్డుల్లో, 3,221 మున్సిపల్ వార్డుల్లో కంటి పరీక్షలు పూర్తయినట్టు అధికారులు వెల్లడించారు.