తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరనున్న సీఎం కేసీఆర్.. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు.
నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రితో పాటు ఇతర అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. తిరిగి సాయంత్రం హైదరాబాద్ కు చేరుకోనున్నట్లు సమాచారం.