తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ మహరాష్ట్రలో రోజురోజుకూ మరింత సంచలనం సృష్టిస్తున్నది. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆ రాష్ట్ర నేతల చేరికల జోరు కొనసాగుతున్నది.
ఈ క్రమంలో భాగంగా మహారాష్ట్రకు చెందిన ‘భూమి పుత్ర సంఘటన్’ ఆదివారం బీఆర్ఎస్లో విలీనమైంది. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో సంఘటన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంతోష్ వాడేకర్‌తోపాటు నేతలు కిరణ్ వాబ్లే, అవినాశ్ దేశ్‌ముఖ్, అశోక్ అందాలే, రాజన్ రోక్డే, అసిఫ్బాయి షేక్ తదితరులు బీఆర్ఎస్లో చేరారు.
వారితో పాటు మహరాష్ట్ర కాంగ్రెస్ నేత సమాధాన్ అర్నికొండ, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన దీపక్ కొంపెల్వార్, యోగితాకొంపెల్వార్ రాము హాన్, త్రిలోక్ జైన్, సంతోష్ కాంబ్లే, అఖిల్ భారతీయ క్రాంతిదళ్ సంఘటన్‌కు చెందిన లక్ష్మికాంత్ భంగే తదితరులు సైతం బీఆర్స్ కండువా కప్పుకున్నారు.