ఐనవోలు మండలం లో ముస్లిం సోదరులకు క్యాంపు కార్యాలయం లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఐనవోలు మండల ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ కానుకలను ఎమ్మెల్యే గారు పంపిణి చేశారు. ప్రతీ ఒక్కరూ ఆనందోత్సాహలతో రంజాన్ పండుగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఇఫ్తార్ విందులు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం చాలా సంతోషమన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గజ్జల శ్రీ రాములు,జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు శ్రీమతి ఎల్లావుల లలితా యాదవ్,జడ్పీ కో ఆప్షన్ సభ్యులు ఉస్మాన్ అలీ, ఎమ్మార్వో రాజేష్, వైస్ ఎంపీపీ తంపుల మోహన్, అయినవోలు దేవస్థానం చైర్మన్ మజ్జిగ జయపాల్, మండల పార్టీ అధ్యక్షులు పోలేపల్లి శంకర్ రెడ్డి, నందనం సొసైటీ వైస్ చైర్మన్ తక్కలపల్లి చందర్రావు దర్గా సోసైటీ వైస్ చైర్మన్ మాదాసు బాబు మండల కో ఆప్షన్ గుంశావళి నియోజకవర్గ అధికార ప్రతినిధి మిద్దపాక రవీందర్, మాజీ ఆలయ చైర్మన్ మునిగాల సమ్మయ్య, ఆత్మ డైరెక్టర్ కట్కూరి రాజు, అనుబంధ అనుబంధ సంఘాల అధ్యక్షులు రాఘవులు, దుప్పెల్లి కొమురయ్య, సింగారపు విజయభాస్కర్ మరుపట్ల నరేష్ అబ్బాస్ అలీ, ప్రచార కార్యదర్శి తాండ్ర కోమలత, ఎంపీటీసీలు కొత్తూరు కల్పన మధుకర్, మెరుగు రాజేందర్ మాజీ ఎంపిటిసి స్వప్న, గ్రామ పార్టీ అధ్యక్షులు బొల్లెపల్లి పరమేశ్వర్, కార్యకర్తలు, ముస్లిం సోదరులు మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు