కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్ (జొన్న బండ)లో ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదలకు ఇండ్ల పట్టాల విషయమై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు స్థానిక ఎమ్మార్వో సంజీవ రావు గారితో కలిసి సమావేశం అయ్యారు.
ఈ మేరకు పేదలకు ఇబ్బందులు లేకుండా సర్వే చేపట్టి అర్హులైన వారికి ఇండ్ల పట్టాలు అందించి న్యాయం జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పేట్ బషీరాబాద్ ఎస్సై రామ కృష్ణ, వార్డు మెంబర్ ఇందిరా రెడ్డి మరియు సురేష్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.