తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక ,పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో అమెరికాలో జరిగిన ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ లో హైదరాబాద్ చెందిన పాకో మార్షల్ ఆర్ట్స్ టీం కి చెందిన నలుగురు క్రీడాకారులు పథకాలు సాధించిన సందర్భంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు క్రీడల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై ప్రతిభ ను కనబరుస్తూ పథకాలు సాధించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తెస్తున్నారన్నారు.
క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలలో, ఉన్నత విద్యా లో రిజర్వేషన్లను అందిస్తున్నామన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 18 వేల క్రీడా ప్రాంగణాలను నిర్మించామన్నారు మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్. క్రీడలలో అంతర్జాతీయ స్థాయిలో పతకాలను సాధించిన క్రీడాకారులకు ప్రభుత్వం విలువైన ప్రాంతాలలో ఇళ్ల స్థలాలను, నగదు ప్రోత్సాహకాలను గణనీయంగా పెంచమన్నారు.
ఈ సందర్భంగా పతకాలు సాధించిన క్రీడాకారులను మంత్రి అభినందించారు.
పథకాలు సాధించిన క్రీడాకారుల పేర్లు.
1, 65 కేజీల విభాగంలో సయ్యద్ మహమ్మద్ హుస్సేన్ గోల్డ్ మెడల్,
2, 60 కేజీల విభాగంలో మహమ్మద్ పతే అలీ గోల్డ్ మెడల్.
మహిళా విభాగంలో 3, 55KG ల విభాగం లో సహెద ఫరీద సుల్తానా రజతం, 4, 57 kg ల విభాగం లో సహెద సుల్తానా కాంస్య పతకాలను సాధించిన సందర్భంగా మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ క్రీడాకారులను అభినందించారు.