దక్షిణాది అల్పాహారం ఇడ్లీ, దోశెను ఇష్టపడని వారుండరు. ఉత్తరాది వారు సైతం సౌత్ స్పైసీ దోశె తినేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఇక బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా దోశెను ఆరగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దోశెను నీనా గుప్తా పలికిన తీరు కూడా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను నీనా గుప్తా పోస్ట్ చేయగా అనుభ అనే యూజర్ ట్విట్టర్లో షేర్ చేశారు.
ఈ షార్ట్ క్లిప్‌లో నీనా గుప్తా దోశెను తింటూ కనిపించారు.జీవితంలో ఇడ్లీ, దోశె కంటే ఏముంటుంది..చాలా రోజుల తర్వాత రెండో దోశెను తింటున్నానని ఈ వీడియోలో ఆమె అన్నారు. నీనా గుప్తా దోశెను సరిగ్గా పలికితే మిమ్నల్ని ఆపేదేముంది..? అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.