తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయాన్ని ఈ నెల 30న ప్రారంభం కానున్న సంగతి విదితమే.
ఇందులో భాగంగా ఈ నెల 24 నుంచి అన్ని ప్రభుత్వశాఖల కార్యాలయాల తరలింపును ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. BRK భవన్లో ఉన్న ఫర్నిచర్ తీసుకురావొద్దని, కొత్త సచివాలయంలో పూర్తిస్థాయిలో ఫర్నిచర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.