ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టిడ్కో ఇళ్ల వద్ద సెల్ఫీ తీసుకోవడం సిగ్గుచేటని మంత్రి జోగి రమేష్ అన్నారు.
“చంద్రబాబుకు దమ్ముంటే.. గడప గడపకు వెళ్లి డ్వాక్రా మహిళలకు ఏం చేశావో, రైతుల రుణమాఫీ చేశావా? అని అడిగుదాం” అని మంత్రి ఛాలెంజ్ చేశారు.
ప్రజలకు మేలు చేశాము కాబట్టే వాళ్ళ ఇళ్ళకు వెళుతున్నామని చెప్పారు. పైరవీలు లేకుండా డబ్బులు నేరుగా ఎకౌంట్లలోకి రావడం తాము గతంలో ఎప్పుడూ చూడలేదని ప్రజలు చెబుతున్నారని వివరించారు.