తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్.. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ పై నమోదు చేసిన FIRలో కీలక విషయాలున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న పేపర్ లీకేజీల వెనక బండి సంజయ్ కుట్ర ఉందని పోలీసులు పేర్కొన్నట్లు తెలుస్తోంది.
అంతేకాక.. ఎగ్జామినేషన్ సెంటర్ల వద్ద ధర్నాలు చేసేందుకు ఆయన కుట్ర పన్నారని అందులో ప్రస్తావించారు. ప్రశాంత్‌తో కొంతకాలంగా కాంటాక్ట్ ఉన్న బీజేపీ నేత.. వాట్సాప్ లో సమాచారం వైరల్ చేసి గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారని పోలీసులు గుర్తించారు.