బంగారం, వెండి ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒక్కరోజులోనే బంగారం ధర దాదాపు రూ.1000 పెరిగింది. మరోవైపు వెండి ధర దాదాపు రూ.3వేలు పెరిగింది.
బుధవారం హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.950 పెరిగి రూ.56,250 కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,030 పెరిగి రూ.61,360 కి చేరింది. కిలో వెండి ధర రూ.2,900 పెరిగి రూ.80,700 కి చేరుకుంది.