జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటనలో ఉన్నారు. నిన్న రాత్రి పవన్ ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ ఇవాళ సమావేశం అయ్యే అవకాశం ఉంది. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
