ప్రముఖ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సీనియర్ నటుడు.. స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. దీనిలో కాజల్ హీరోయిన్ గా, శ్రీలీల ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
ఈ మూవీలో ఓ పాట చిత్రీకరణ కోసం రామోజీ ఫిలింసిటీలో రూ.5 కోట్లతో సెట్ వేసినట్లు తెలిసింది. గణేషుడికి సంబంధించిన ఓ పాటను బాలయ్య, శ్రీలీలతో ఈ సెట్లోనే గ్రాండ్గా చిత్రీకరిస్తున్నారట. బాలకృష్ణ, కెరీర్లోనే అత్యధిక వ్యయంతో తెరకెక్కుతున్న పాట ఇదేనని చిత్ర బృందం తెలిపింది.