ఏపీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 3వ తేదీన వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులతో సమావేశం కానున్నారు. తాజా రాజకీయాలు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, గడప గడపకు కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తారని సమాచారం.
2024 ఎన్నికలకు సంబంధించి క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలు సార్లు ఎమ్మెల్యేలతో సమావేశమైన సీఎం పలువురు ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.